జగనన్న వసతి దీవెన రెండో విడత నేడు విడుదల
- PRASANNA ANDHRA

- Apr 8, 2022
- 1 min read
అమరావతి, రాష్ట్రవ్యాప్తంగా జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు విడుదల చేయనున్నారు.

నంద్యాలలో జరిగే బహిరంగ సభలో 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేస్తారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే వారి భోజన, వసతి ఖర్చులు చెల్లింపు.
ఈ పథకం కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.








Comments