అమృత నగర్ లో జగనన్న సురక్ష కార్యక్రమం
- PRASANNA ANDHRA

- Oct 25, 2023
- 1 min read
అమృత నగర్ లో జగనన్న సురక్ష కార్యక్రమం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని పాత అమృత నగర్ కె5 సచివాలయం నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మార్వో నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, సదరు కార్యక్రమంలో ప్రజల కొరకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి, క్యాంపు నందు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకొని, ప్రజలకు మందులు పంపిణీ చేస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు కొత్తపల్లి పంచాయతీ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.









Comments