ఆరోగ్య సురక్ష కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు
- PRASANNA ANDHRA

- Oct 3, 2023
- 1 min read
ఆరోగ్య సురక్ష కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రజలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక శ్రీరాములు పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాలలో ఆయన పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష హెల్ప్ డెస్క్, బీపీ రిజిస్ట్రేషన్, పోషక ఆహార, ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, స్పాట్ సర్వే కౌంటర్లను ఆయన పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో హెల్త్ వాలంటీర్స్, వైసిపి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య సురక్ష సేవలను సద్వినియోగం చేసుకున్నారు.










Comments