top of page

అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించిన కాంతి రాణా టాటా

  • Writer: MD & CEO
    MD & CEO
  • Sep 26, 2022
  • 1 min read

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

ree

విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా సతీ సమేతంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.


ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అనవాయితీ ప్రకారం రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారికి సారెను తీసుకుని దుర్గగుడికి వెళ్ళగా, దుర్గగుడి ఈ.ఓ. భ్రమరాంబ, దుర్గగుడి అధికారులు నగర పోలీస్ కమీషనర్ దంపతులను సాదరంగా ఆహ్వానం పలికి వేద పండితుల నడుమ పూజలు జరిపి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page