శ్రీ సాయి వికాస్ లో పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ సంబరాలు.
- DORA SWAMY

- Aug 15, 2023
- 1 min read
శ్రీ సాయి వికాస్ లో పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ సంబరాలు.

చిట్వేలి శ్రీ సాయి వికాస్ పాఠశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని త్రివర్ణ పతాకంతో సుందరంగా అలంకరించారు. కరస్పాండెంట్ తిరుమల చిన్న రెడ్డయ్య త్రివర్ణ పతాకావిష్కరణ గావించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినమని, రేపటి దేశ భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉన్నదని గొప్ప లక్ష్యాలతో ఉన్నత స్థాయికి చేరాలని పిల్లలకు కరస్పాండెంట్ సూచించారు. ప్రధానోపాధ్యాయులు షాజి భాస్కర్ పిల్లను పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆటపాటలతో, పలు సాహసోపేత విన్యాసాలతో విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరని అబ్బురపరిచాయి. వీక్షించిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








Comments