top of page

ఏ పీ ఎం డి సి లో స్కావెంజర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని సి హెచ్ చంద్రశేఖర్ డిమాండ్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 9, 2022
  • 1 min read

ఏపీ ఎం డి సి లో  స్కావెంజర్స్ కి కనీస వేతనాలు అమలు చేయాలి  సి ఐ టి యు డిమాండ్!


ree

ఏపీఎండీసీ హెడ్ ఆఫీస్ లో, మంగంపేట ఏపీ ఎం డి సి స్కూల్ లో స్కావెంజర్స్, టాయిలెట్,  స్వీపర్ కి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం   అన్ స్కిల్డ్ వేతనం 15000 చెల్లించాలని ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్   సి ఐ టి యు గౌరవ అధ్యక్షులు

సి హెచ్. చంద్రశేఖర్, డిమాండ్ చేశారు.


పిఎఫ్, ఈ ఎస్ ఐ అమలు చేయాలన్నారు. ప్రిన్సిపల్ ఎంప్లాయిస్ గా ఏపీఎండీసీ యాజమాన్యం జోక్యం చేసుకొని అమలు చేయాలని, లేకుంటే కాంట్రాక్టర్ లను   బ్లాక్ లిస్టులో పెట్టాలని  డిమాండ్ చేశారు. ఈ విషయం గురువారం  ఏపీఎండీసీ ఎండి శ్రీ  వి.జి.వెంకట్ రెడ్డి,దృష్టికి తీసుకోవడం జరిగింది అన్నారు . మినిమం వేతనం కాంట్రాక్టర్ల చేత అమలు చేయాలని ఆదేశించారు.


సంస్థ ఎండి గత నాలుగు నెలల క్రితమే   ఏపీఎండీసీ స్కూల్లో అమలు చేయాలని ఆదేశించిన  కింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ బాధ్యతారహితంగా కాలయాపన చేస్తున్నారన్నారు. కరోనా లో సమర్థవంతంగా పనిచేశారని వీరి సేవలకు  ఎంత ఇచ్చినా తక్కువే అన్నారు. హెడ్ ఆఫీస్ లో  యూనియన్ పోరాట ఫలితంగా, 151 జిఓ ప్రకారం 12000 జీతం చెల్లిస్తున్నారు, గతంలో 8000 మాత్రమే చెల్లించే వారిని గుర్తు చేశారు. మంగంపేటలో  ఏపీఎండీసీ స్కూల్లో ఎనిమిది వేలు మాత్రమే కాంట్రాక్టు చెల్లిస్తున్నారని చెప్పారు. కార్మిక చట్టాలను  కాంట్రాక్టర్లు ఏజెన్సీలు   ఉల్లంగిస్తున్నారని,   ఆరోపించారు. వీరందరిని అవుట్సోర్సింగ్  ఏజెన్సీలోకి మార్చి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page