top of page

పేదలందరికీ ఇల్లు - సీఎం జగన్ ప్రత్యేక దృష్టి

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 23, 2022
  • 1 min read

ఏపీలో పేదలందరికీ ఇల్లు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి

ree

ఆంధ్రప్రదేశ్ లో పెదలందరికీ ఇల్లు క్రింద జరుగుతున్న పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హౌసింగ్‌ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కోటి రూపాయిల విలువైన పనులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. దాదాపు రూ. 4,318 కోట్లు రెండు దశల్లో మొత్తం రూ.21.55 లక్షల ఇళ్లను చేపట్టనున్నారని వారు తెలియచేసారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రతి వారం ఇళ్ల నిర్మాణాలు చేపడతామని, అక్టోబర్‌ నుంచి వారానికి 70 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని హౌసింగ్ శాఖ అధికారులు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page