కోడలిపై దాడి కేసు, ఆరా తీసిన హోంమంత్రి
- PRASANNA ANDHRA

- Apr 28, 2022
- 1 min read
అమరావతి, తాడేపల్లిగూడెం పడాల కోడలి పై దాడి కేసుపై ఆరా తీసిన హోంమంత్రి తానేటి వనిత. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి, కోడలిపై కత్తితో దాడి చేసిన మామపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన హోం మినిస్టర్.
కొడుకు శ్యామ సుందరం సంవత్సరికం రోజున కోడలిపై దాడి చేసిన మామ. గాయాల పాలైన విప్పర్తి మాలతి కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన తానేటి వనిత. కత్తితో దాడికి పాల్పడిన విప్పర్తి దైవ వరప్రసాద్ విశ్రాంత ఉద్యోగి.








Comments