బైక్ ను ఢీ కొన్న లారీ వ్యక్తి మృతి
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా గిద్దలూరు - నంద్యాల రోడ్డు మార్గం నల్లమల అటవీ ప్రాంతంలో బైక్ ను ఢీ కొట్టిన లారీ. ఒక వ్యక్తి మృతి మరొకరి పరిస్థితి విషమం. సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు హైవే మొబైల్ పోలీసులు వర్ర.శంకరయ్య, సయ్యద్ ఖాజావలి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గిద్దలూరు హైవే మొబైల్ పోలీసులు వర్ర.శంకరయ్య, సయ్యద్ ఖాజావలి మోటార్ సైకిల్ ను డీ కొట్టిన లారీని వెంబడించి డ్రైవర్ను, లారీని పట్టుకొని గిద్దలూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఘటనా స్థలానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు చేరుకొని ఆక్సిడెంట్ కు గలా పూర్తి వివరాలు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.










Comments