top of page

హీరో నాగశౌర్య వివాహం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 20, 2022
  • 1 min read

హీరో నాగశౌర్య వివాహం

ree

బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదికగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వివాహం. హాజరైన పలువురు సెలబ్రిటీలు.


టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు.  ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు. అంతకుముందు శనివారం రాత్రి యువ దంపతులు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగశౌర్య .. అనూష వేలికి ఉంగరం తొడిగాడు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page