మీడియా ప్రతినిధుల జోక్యంతో వృద్దుడికి వైద్యం
- PRASANNA ANDHRA

- Feb 28, 2022
- 1 min read
వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దటూరు నిన్నటి రోజున వృద్దుడిని నడివీధిలో బెడ్ తో సహా గుర్తు తెలియని వ్యక్తులు బయట పడవేసిన సంఘటన సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ గా మారిన సంగతి పాఠకులకు విదితమే, అయితే ఈ సంఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఉదయం అక్కడి సంఘటనను సామాజిక మాధ్యమాలలో ప్రసారం కాగా రాత్రి 9:00 గంటల వరకు వృద్దుడికి కనీస వైద్యం అందించకపోవటం ఇక్కడ గమనార్హం. మీడియా రంగప్రవేశంతో తమ తప్పు తెలుసుకున్నారో లేక భాద్యతగా అనుకున్నారో ఏమో కానీ ఎట్టకేలకు వృద్దుడికి వైద్యం అందించేందుకు ఆసుపత్రి వర్గాలు ముందుకు వచ్చాయి. 'జ్యోతి' దినపత్రిక ప్రొద్దుటూరు ప్రతినిధి పస్యావుల శ్రీధర్ ఈ ఉదంతాన్ని సామాజిక మాధ్యమాలలో తన వొంతు బాధ్యతగా ప్రసారం చేయగా, 'NTV' అలాగే '6TV' ప్రొద్దుటూరు ప్రతినిధులు అయిన ఉట్టి నరేంద్ర, పోసా మహేష్ లు మేమున్నామంటూ ముందుకు వచ్చి వృద్దుడిని సేవలు సపర్యలు చేసి ఆసుపత్రిలో చేర్పించారు, వృద్దుడయిన కేశవ రెడ్డికి పట్ల వారి మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజంలో మానవత్వం మానవ విలువలు నశించలేదు ఇంకా బ్రతికే ఉంది అని మరోమారు నిరూపించారు ఈ ముగ్గురు. ఈరోజు ఉదయం కేశవరెడ్డి ని పరామర్శించి అన్నపానీయాలు భోజన వసతులు కల్పించే దిశగా అడుగులు వేశారు, ఏది ఏమయినా మీడియా మిత్రులు సమాజ సేవ కొరకు తమవొంతు బాధ్యత నిర్వర్తించటం సాటి విలేకరిగా 'ప్రసన్న ఆంధ్ర' వార పత్రిక ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.









Comments