top of page

హజరత్ ఖాదర్ వలీ దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 22, 2023
  • 1 min read

హజరత్ ఖాదర్ వలీ దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

ree
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల అరవపల్లి రైల్వే కాలనీలో ఉన్న శ్రీ హజరత్ ఖాదర్ వల్లి దర్గా 132వ ఉరుసు మహోత్సవ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే ఈ ఉరుసు మహోత్స వానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆ హజరత్ ఖాదరవల్లి బాబా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎంతో ఘనంగా దర్గా అధ్యక్షుడు కమాల్ భాష, ఉపాధ్యక్షుడు షమీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఈ ఉరుసు నిర్వహించడం కులమతాలకు ప్రత్యేకగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా ఖాన్ , వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు అన్నం నాగేంద్ర, నాగిరెడ్డి పల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page