top of page

బీచ్‌కి తీసుకెళ్లమంటే.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 5, 2023
  • 1 min read

ఆటో ఎక్కిన స్టూడెంట్స్.. బీచ్‌కి తీసుకెళ్లమంటే.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్

ree

పల్నాడు జిల్లా


ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. ఇద్దరు పిల్లల ప్రాణాలు నిలిపాడు. నరసరావుపేటకు చెందిన ఇద్దరు 9వ తరగతి విద్యార్దులు ఆటోను ఆపారు. చీరాల మండలం వాడరేవు సముద్రతీరంవైపు తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌ను కోరారు. డ్రైవర్ సరే అన్నాడు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వారు ఆత్మహత్య గురించి మాట్లాడుకోవడాన్ని విన్నాడు డ్రైవర్. దీంతో నేరుగా తీసుకెళ్లి వారిని.. పోలీసులకు అప్పగించాడు ఆటో డ్రైవర్‌ ఏసుబాబు.

ree

పుస్తకాలు పోగోట్టుకోవడంతో.. తల్లిదండ్రులు తిడతారన్న భయంతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు చీరాల వచ్చినట్టు పోలీసులకు తెలిపారు విద్యార్దులు. విద్యార్దులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు చీరాల పోలీసులు. చూశారా..? ఆటో డ్రైవర్ గమనించకపోయి ఉంటే.. 2 పసిమొగ్గలు రాలిపోయేవి. తల్లిదండ్రులూ…! పిల్లలతో ప్రేమగా మెలగండి. చిన్న సమస్య అయినా.. పెద్ద సమస్య మీ వద్దకు వచ్చి పంచుకునేలా వారిని పెంచండి. లేదంటే.. కౌమార దశలో వారు దారి తప్పడమో, అందకుండా పోవడమో జరిగే ప్రమాదం ఉంది.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page