హనుమాన్ దళ్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన
- PRASANNA ANDHRA

- Oct 26, 2022
- 1 min read
హనుమాన్ దళ్ వారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ వి నగరం గ్రామంలో హరేకృష్ణ ధర్మ రక్షణ సమితి సభ్యులు నగర సంకీర్తన... బ్రహ్మ ముహుర్త కాలంలో హరినామం కీర్తిస్తూ సంకీర్తన పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక భక్తి గేయాలతో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కార్తీకమాసం సందర్బంగా బుధవారం ఉదయం 3.30 గంటలు నుంచి 6 గంటలు వరకు రెండున్నర గంటల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో, హరేకృష్ణ ధర్మ రక్షణ సమితి సభ్యులు పలువురు హిందూ బంధువులు స్వచ్ఛందంగా ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. గ్రామంలో వీధులు గుండా "హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే" "హరేరామ హరేరామ రామ రామ హరే హరే" అంటూ గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయంలో స్వామి వారికి మంగళహారతులు ఇస్తూ నగర సంకీర్తన కొనసాగించారు. ఈ సందర్బంగా హరేకృష్ణ ధర్మ రక్షణ సమితి అధ్యక్షులు దుళ్ళ కృష్ణ మాట్లాడుతూ సర్వేజన సుఖినోభవంతు అనే ఆర్యోక్తికి అనుగుణంగా సర్వమానవ శ్రేయస్సును కోరుతూ నిర్వహించే నగరసంకీర్తన నేడు కనుమరుగై పోయింది. నేడు వాహనాల రణగొణధ్వనులు తప్ప గ్రామగ్రామాన ప్రాతః కాలంలో లయబద్దంగా వినబడే కీర్తనలు ఇప్పుడు వినపడకుండా పోయాయి. నేటి యువతకు నగర సంకీర్తన అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఎ వి నగరంలో గత 7 ఏళ్లుగా క్రమం తప్పకుండా సాగుతున్న నగర సంకీర్తన ఇక్కడి అధ్యాత్మికతకు అద్దం పడుతుంది.కార్తీకమాసం నెల రోజులు పాటు గ్రామంలో నగర సంకీర్తన నిర్వహిస్తాము అన్నారు.ఈ కార్యక్రమంలో హరేకృష్ణ కృష్ణ ధర్మ రక్షణ సమితి సభ్యులు, హిందూ బంధువులు పాల్గొన్నారు.









Comments