top of page

పేదల ఇల్లు ప్రభుత్వమే కట్టించాలి. సి హెచ్ చంద్రశేఖర్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 14, 2022
  • 2 min read

ఇంటి స్థలాలు, జగనన్న ఇల్లు కట్టించి, దారి కల్పించాలి! సి ఐ టి యు డిమాండ్.


జనం కోసం సిపిఎం, ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో, మంగళవారం ఉదయం, గుండాల పల్లి పంచాయతీ, గాంధీనగర్ లో సిపిఎం నాయకులు పర్యటించారు.


ree

అనేకమందికి నేటికీ ఇంటి స్థలాలు ఇవ్వలేదని, కొందరికి జగనన్న కాలనీ లో భాగంగా రెడ్డివారి పల్లి పంచాయతీలో, ఒకటిన్నర సెంటు లెక్కన ఇచ్చారని.. కాలనీ కట్టి ఇంటి తాళం ఇస్తామని చెప్పిన జగనన్న చేతులెత్తేసి మీరే కట్టుకోండి అని చెప్పారన్నారు. కానీ నేటి ధరలతో ఇసుక,  కమ్మి, సిమెంటు, ఇటుక, కంకర, చెక్క,  కూలి రేట్లు అధికంగా పెరిగాయన్నారు.  బేస్ మట్టం 1 లక్ష రూపాయల దాటుతుందని, లక్షా ఎనభై వేల తో ఎలా ఇల్లు కట్టాలని, కూలి చేసుకునేవారికి అయిదారు లక్షలు, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వమే  జగనన్న కాలనీ  కట్టి ఇవ్వాలనే డిమాండ్ చేశారు.

గాంధీనగర్ వాసులు మెయిన్ రోడ్డుకు దారి లేదని, గతంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి దారి లేకుండా   కడుతున్నప్పుడు  అడ్డుకోవడం జరిగిందని , అధికార పార్టీ అండతో కాంట్రాక్టరు దారి లేకుండా నిలుపు చేశారన్నారు. కనీసం మెట్లు దారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంజన నది కి ప్రొటెక్షన్ వాలు ఏర్పాటు చేయాలన్నారు. అనేకమందికి , వృద్ధాప్య ,విడో పెన్షన్ రాలేదన్నారు.


ree

జగనన్న ప్రభుత్వం లో కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడి కి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఆయా పోస్టు భర్తీ చేయాలని కోరారు. సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ


ఉచిత  ఇసుక విధానం ఎత్తివేయడం ద్వారా, వైసీపీ ప్రభుత్వం ప్రకృతి నుంచి ఉచితంగా వచ్చే ఇసుకకు అధిక ధర పెంచడం వల్ల, పేద మధ్యతరగతి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని, భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని, బిల్డింగ్ వర్కర్స్ కి, పదివేల రూపాయలు అకౌంట్లో వేయాలన్నారు. సీజనల్ పనుల్లో పనిచేస్తున్నారని, ధరలు  విపరీతంగా పెరగడం కారణంగా, కూలీ డబ్బులు సరిపోవడం లేదన్నారు. జగనన్న లక్ష రూపాయలు పెళ్లి కానుక రద్దు చేశారు, పేదలు వివాహాలు జరపడం భారంగా ఉందన్నారు, గత టిడిపి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం, ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని,  ముఖ్యమంత్రి జగనన్న,రాజన్న పాలన తెస్తానని, మోడీ పాలన తీసుకువస్తున్నారని ఆరోపించారు. 


పెట్రోలు  డీజిల్, గ్యాస్ ధర, నిత్యవసర వస్తువులు, ఆస్తిపన్ను, కరెంటు చార్జీలు, విద్యుత్ మీటర్లు, మోడీ విధానాలను, జగనన్న అమలు చేస్తున్నారన్నారు.  విభజన చట్టం హామీలు,ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాల ప్యాకేజీ, కడప ఉక్కు,  పరిశ్రమ, ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, లింగాల యానాదయ్య, దాసర జయచంద్ర, బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page