వైసీపీకి జాతీయ మాల మహానాడు మద్దతు - గోసా మనోహర్
- PRASANNA ANDHRA

- May 7, 2024
- 1 min read
రాష్ట్రానికి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
- గోసా మనోహర్



వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరోమారు వైసిపి అభ్యర్థులకు ఓట్లు వేసి తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రాష్ట్రానికి మరోమారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బీసీ ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలరని జాతీయ మాల మహానాడు జాతీయ ప్రెసిడెంట్ గోసా మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సొంత ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నాణ్యమైన విద్య, వైద్యం, మంచినీరు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ప్రజలు విస్మరించి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే, ఇటు రాష్ట్రం అటు దేశం అధోగతి పాలవుతాయని అన్నారు.

ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే దళితులు, ముస్లింలు ఏకపక్షముగా వైసిపికి మద్దతు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి గంగన్న, జిల్లా అధ్యక్షుడు తప్పెట లాజర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.











Comments