బంగారు వ్యాపారి శ్రీనివాస్ ఉదంతంపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే వరద
- EDITOR

- Nov 23
- 1 min read
బంగారు వ్యాపారి శ్రీనివాస్ ఉదంతంపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే వరద

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల గడిచిన ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలేదని శుక్రవారం బంగారు వ్యాపారి తనకంటి శ్రీనివాస్ ఉదంతాన్ని ఉదాహరిస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తనదైన శైలిలో పోలీసు శాఖపై ధ్వజమెత్తారు. సివిల్ వుదంతాలలో పోలీసుల ప్రమేయం ఏమిటని ప్రశ్నిస్తూ శ్రీనివాసులు ఆయన సోదరుడు వెంకటస్వామిని పోలీసులు అక్రమంగా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించి ఏడు కోట్ల రూపాయల మేర సెటిల్మెంట్ చేయాలని చూశారన్నారు. శ్రీనివాసులు ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు, బంగారు దుకాణ తాళాలు తీసుకెళ్లారని, రక్షించవలసిన పోలీసులే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజలకు రక్షణ మాటేమిటన్నారు. ఉన్నతాధికారుల మెప్పుకోసం పోలీసులు ఇలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమైన చర్యని ఆయన అభిప్రాయపడుతూ, చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టరీత్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సబబు కాదని హితువు పలికారు. ప్రొద్దుటూరు ఉన్నత అధికారులు ఈ ఉదంతం పై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఈ ఉదంతం త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతానన్నారు.
అనంతరం శ్రీనివాసులు భార్య లక్ష్మీ మాట్లాడుతూ, తన భర్త కిడ్నాప్ వెనుక ప్రొద్దుటూరులోని ఒక ప్రముఖ బంగారు వ్యాపారవేత్త హస్తం ఉందని ఆరోపణలు గుప్పించారు. తన భర్తకు సంబంధంలేని అప్పులు తమపై బనాయించి హింసించడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కాపాడాలని ఎమ్మెల్యే వరదను లక్ష్మీ కోరారు.









Comments