వైస్ చైర్మన్ ని కలిసిన గోకుల్ నగర్ వాసులు
- PRASANNA ANDHRA

- May 15, 2023
- 1 min read
వైస్ చైర్మన్ ని కలిసిన గోకుల్ నగర్ వాసులు


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డిని కలిసి తమ వీధిలో రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టాలని కోరిన గోకుల్ నగర్ వాసులు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి మాట్లాడుతూ, వీధిలోని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఇందుకుగాను నూటా అరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో పట్టణంలో పలు అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో, రాబోవు రెండు నెలల వ్యవధిలో గోకుల్ నగర్ నందు ముందుగా మురుగునీటి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు, తదనంతరం సిసి రోడ్లు పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో గోకుల్ నగర్ నందు త్రాగునీటి వ్యవస్థను మెరుగుపరిచి మంచినీటి సరఫరా చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు గోకుల్ నగర్ వాసులు పాల్గొన్నారు.










Good