గీతా జయంతి సందర్భంగా ఉచితంగా భగవద్గీత పంపిణీ
- PRASANNA ANDHRA

- Dec 3, 2022
- 1 min read
గీతా జయంతి సందర్భంగా ఉచితంగా భగవద్గీత పంపిణీ

గీతా జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు 33వ వార్డులో ప్రతి హిందూ కుటుంబం నందు భగవద్గీత ఉండాలని, భగవద్గీత ప్రతిరోజు కనీసం ఒక శ్లోకమైన చదవాలని అవగాహన కల్పిస్తూ ప్రతి హిందూ కుటుంబానికి భగవద్గీత ఉచితంగా అందించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్నాటి ఎల్లారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి భగవద్గీతను జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయకనగర్ రామ సేవకులు కొంపలహరి విజయకుమార్, టీటీడీ సుబ్రహ్మణ్యం, వంకదార సుబ్బారావు, బిజెపి నాయకులు పరమేశ్వరరావు, ముత్యాల శ్రీశ్రీ, యజ్ఞ వల్కి, కుమారస్వామి పాల్గొన్నారు.










Comments