top of page

ఘంటసాల శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 24, 2023
  • 1 min read

ఘంటసాల శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి

అన్నమయ్య కళాకారుల సంఘం
ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


అన్నమయ్య కళాకారుల సంఘం రాజంపేట ఆధ్వర్యంలో ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఈనెల 30వ తేదీ గాంధీ మెమోరియల్ క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవాలలో ఘంటసాల అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కళాకారుల సంఘం కార్య నిర్వాహ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ree

ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాజంపేట జిఎంసి కళ్యాణమండపంలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథులుగా కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, విశిష్ట అతిధులుగా సబ్ కలెక్టర్ అహమ్మద్ ఖాన్, డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ree

శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేవారు డెలిగేట్ రుసుముగా రుసుంగా రూ 300 లు 28వ తేదీలోగా చెల్లించాలని., డెలిగేటుగా పేరు నమోదు చేసుకున్న సభ్యులు ప్రతి ఒక్కరూ ఘంటసాల లేక ఎస్పీ బాలసుబ్రమణ్యం గానం చేసిన రెండు పాటలను పాడే అవకాశం ఉంటుందని తెలిపారు. డెలిగేటిగా తమ పేర్లు నమోదు చేసుకోదలచిన వారు బండ్ల రాజేష్ 9848 642 882 ఫోన్ ద్వారా ఫీజు చెల్లించాలని, ఇతర వివరాలకు సంప్రదించాలని కోరారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page