విద్యుత్ స్తంభాలు దీపాలకు మోక్షం
- PRASANNA ANDHRA

- Jan 27, 2022
- 1 min read
ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, గంగవరం, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి చొరవతో ఎట్టకేలకు గంగవరం గ్రామంలో ప్రమాద స్థాయిలో ఉన్న విద్యుత్ స్థంబాలకు మోక్షం లభించింది. గంగవరం స్థానికలు కొరలయ్య, నూకలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దల్లి గోవింద రెడ్డి గాజువాక విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ప్రమాద స్థాయిలో ఉన్న విద్యుత్ స్థంబాలను తీసి కొత్త స్తంభాలు, కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు, అవసరమైన కొత్తగా దీపాలు వేయడం జరిగింది గ్రామ దేవత ఆలయం ముందు అదే విధంగా దార వీధి, గంగవరం హై స్కూల్, గంగవరం మెయిన్ రోడ్ లో ఉన్న చర్చి దగ్గర, జాలరి పల్లిపాలెం ఇలా పలుచోట్ల విద్యుత్ దీపాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ భయ ఆందోళనకు గురవుతూ నిత్యం ఇబ్బందులు పడుతూ ఉండడం వలన 64వ వార్డు కార్పొరేటర్ దాల్లి గోవింద్ రెడ్డి కి సమస్యలు వివరించారు కార్పొరేటర్ తక్షణమే స్పందిస్తూ జీవీఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు పంపించి లైట్స్ బాగు చేయించి వెలిగేలా చేశారు అంతేకాకుండా పలుచోట్ల కొత్త పోల్స్ వేయించారు. గంగవరం ప్రజలు అందరూ సంతోషించి కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ ఒక కార్యక్రమం గంగవరం జనసేన నాయకులు ఆధ్వర్యంలో గంగవరం ప్రజల సహకారంతో సంపూర్ణంగా జరిగింది.














Comments