బి కొత్తపల్లిలో ఘనంగా గంగమ్మ దేవత తిరుణాళ్ళ ఉత్సవం
- DORA SWAMY

- Jul 31, 2022
- 1 min read
Updated: Aug 1, 2022
బి కొత్తపల్లిలో ఘనంగా గంగమ్మ దేవత తిరుణాళ్ళ ఉత్సవం.
కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మాయపాలెం పంచాయతీ బి కొత్తపల్లి హరిజనవాడలో గంగమ్మ దేవత తిరునాళ్ళ ఉత్సవాన్ని సదరు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గ్రామ దేవతకు పొంగుల్లు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ మండల సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ,సర్పంచ్ తుపాకుల బాలు, ఎంపీపీ చంద్ర, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్య రెడ్డి, మైలపల్లి పంచాయితీ మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, పెంచలయ్య తదితరులు హాజరయ్యారు.కాగా కొప్పల సాలయ్య, కొప్పల వెంకటస్వామి, నరసింహులు, మనీ, జయన్న, సుబ్బ నరసయ్య, శివ ,హరి ,అనిల్, తదితరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.








Comments