గట్టుమీద పల్లెలో ఘనంగా గంగమ్మ కు పొంగళ్ళు.
- DORA SWAMY

- Jun 16, 2022
- 1 min read
గట్టుమీద పల్లెలో ఘనంగా గంగమ్మ పొంగళ్ళు.
---కలిసికట్టుగా నిర్వహణ, పాల్గొన్న గ్రామ ప్రజలు.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం తిమ్మాయపాలెం పంచాయతీ గట్టు మీద పల్లి గ్రామం నందు ఈరోజు ఉదయం సదరు గ్రామ ప్రజలు కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సాహాల నడుమ శ్రీ గంగమ్మ తల్లి కి పొంగళ్ళను నిర్వహించి, మొక్కుబడులు తీర్చుకున్నారు.

పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి.. గంగమ్మ నీ దయ మా పై ఉండాలమ్మా అంటూ శరణు ఎడుకున్నారు.
ఈ కార్యక్రమంలో సదరు గ్రామ సర్పంచ్ తుపాకుల బాలు, సుబ్బరాయుడు, చిన్న పెంచలయ్య, ఎనుబోయిన గణపతి,మహేష్, తుపాకుల శ్రీను, పెంచలయ్య , తుపాకుల నరసింహులు, నడిపి పెంచలయ్య మరియు గ్రామ పెద్దలు, యువత, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments