వేలం పాటలో 7లక్షల 70వేలు పలికిన గణనాధుడి ప్రసాదాలు
- PRASANNA ANDHRA

- Sep 24, 2023
- 1 min read
Updated: Sep 27, 2023

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ లోని వివేకానంద కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ స్వామి వారి వివిధ రకాల ప్రసాదములు 7 లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు తో వేలంలో దక్కించుకున్నారు.

శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వహించిన స్వామివారి వేలం పాట, వినాయకుడి హస్తంలో గల లడ్డును గంటేనా శివ 121000rs కు దక్కించుకున్నారు, వెండి కాయిన్ రామన బోయిన వెంకటసుబ్బయ్య యాదవ్ 141000rs వేలంలో దక్కించుకున్నారు, స్వామివారి మెడలోని నోట్లమాలను 252000rs కావేటి బాలయ్య యాదవ్ అత్యధికంగా వేలంలో దక్కించుకున్నారు, అలాగే స్వామివారి దగ్గర ఉంచిన పెన్ను పుస్తకమును గొర్ల వరలక్ష్మి యాదవ్ 140000rs కు వేలంలో పాడినారు, స్వామి వారి దగ్గర ఉన్న కలశం చెంబును కోళ్ల నరేష్ యాదవ్ 120000rs దక్కించుకున్నారు, శ్రీ వరసద్ది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడు లేనివిధంగా 774000rs రూపాయలకు వేలంలో రావడం విశేషం, ఈ వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.









Comments