అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరుగుతోంది - ఇమ్రాన్
- PRASANNA ANDHRA

- Aug 13, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త రిపోర్టర్ వీర
అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరుగుతోంది - ఇమ్రాన్

రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరుగుతోందని 66 వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కల నేరెవెర్చి నందుకు 66 వ వార్డు వైసీపీ నాయకురాలు తాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కార్పొరేటర్ ఇమ్రాన్ పాల్గొని జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఒక సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్న పేదవానికి సొంత ఇల్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సొంత ఇల్లు కలిపించి వారి కలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తమ వార్డు ప్రజలందరి తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డిల ఈశ్వరరావు కరణం వేణు గోపాల్. చెరుకూరి నాగేశ్వరరావు కాజా .రాజు. అనసూయ తిప్పలస్వాతి. కేరాధా. ఇంద్ర. విజయ. రమణి. తులసి వార్డు ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆర్ పి లు, మహిళలు పాల్గొన్నారు.








Comments