పెంచిన ఆస్తిపన్ను చెత్త పన్ను అక్రమ పెనాల్టీలు రద్దు చేయాలి - సిపిఎం
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
గాజువాక, పెంచిన ఆస్తిపన్ను చెత్త పన్ను అక్రమ పెనాల్టీలు రద్దు చేయాలని, సిపిఎం పార్టీ పిలుపుమేరకు రెండవ రోజు జీవీఎంసీ గాజువాక జోన్ 67 వార్డ్ జోగవాని పాలెం శాఖ ఆధ్వర్యంలో లో గల పెంటయ్య నగర్ Code : 1086446 మరియు (పెదగంట్యాడ-08) అశోక్ నగర్ Code : 1086450 లలో గల సచివాలయం కార్యదర్శి (అడ్మిన్) లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వివరాల్లోకి వెళితే ప్రజలు కరోనా వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే గోరుచుట్టుపై రోకటి పోటు లాగా చెత్త పన్ను, ఆస్తి పన్ను, మురుగు నీటి పన్ను, కొళాయి పన్నులు పెంచడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కావున దయచేసి పెంచిన పన్నులు రద్దు చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి పాలూరు లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో, కే సంతోషం, కే పి కుమార్, Y సుబ్బారావు, KV రమణ, BV సత్యనారాయణ, K కిరీటం, వై గోవింద్, UVSN వర్మ, M శుభాకర్, సంక్షేమ సంఘం నాయకులు, అశోక్ నగర్, మారుతీ నగర్, జోగ వాణి పాలెం సిపిఎం పార్టీ వార్డు సభ్యులు, పెన్షనర్ల సంఘం నాయకులు, అశోక్ నగర్ ప్రజలు సానుభూతిపరులు పాల్గొన్నారు.








Comments