top of page

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 16, 2022
  • 1 min read

గడపగడపలో ఎమ్మెల్యే కొరముట్ల.

ree

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

ree

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం చిట్వేలు మండలం పోలోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో మాలేమార్పురం గ్రామ సర్పంచ్ ఈశ్వరయ్య,ఎంపీటీసీ కృష్ణయ్య ల ఆధ్వర్యంలో ఈడిగపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాన్ని మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో సమస్యలను చర్చించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇంటి వద్దకే ఒకటో తారీఖున పింఛన్ అందడంపై అవ్వతాతలు ఆనందం వ్యక్తపరిచారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల పిల్లలతో విద్యా విధానంపై, మధ్యాహ్న భోజనం పథకం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ree

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, వైసిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మలిశెట్టి.వెంకటరమణ, లింగం లక్ష్మీకర్, ఎంపీపీ చంద్ర, వైసిపి జిల్లా జనరల్ సెక్రెటరీ దేవరాజ్, ఎమ్మార్వో మురళీకృష్ణ, ఎంపీడీవో మోహన్,ఉప సర్పంచ్ హరి, స్థానిక నాయకులు వెలగచర్ల రమణారెడ్డి, నరసింహులు, కోటేశ్వరరావు,ఎల్లయ్య,సర్పంచులు, ఎంపిటిసిలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page