top of page

మాటల ప్రభుత్వం కాదు మాట నిలుపుకొనే ప్రభుత్వమన్న కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 16, 2022
  • 1 min read

--వానలోనూ కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం .

--ప్రతి కుటుంబంలోనూ ఆనందమే ప్రభుత్వ లక్ష్యమన్న కొరముట్ల.



ree

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన పై ప్రజల అభిప్రాయాన్ని ప్రతినిధులే నేరుగా తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న" గడప గడపకు మనప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రైల్వేకోడూరు మండలం వివి కండ్రిగ గ్రామ సచివాలయ పరిధిలోని హరిజనవాడ, రాచపల్లి గ్రామం నందు గడపగడపకు ప్రభుత్వ విప్ ,శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులను పలకరిస్తూ వారికి అందిన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ఆరా తీస్తూ... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల నుండి సలహాలు,అర్జీలులను స్వీకరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


ree

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, ఎంపీడీవో నాగార్జున,సర్పంచ్ వినోద్, నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page