ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు
- PRASANNA ANDHRA

- Jan 4, 2022
- 1 min read
ఈ రోజు నెహ్రు యువ కేంద్ర చిత్తూర్ మరియు యువనేస్తం అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం ఉడమలపాడు గ్రామంలో ఉన్న మహిళలకు 3 నెలల పాటు ఉచ్చితంగా ట్రైలరింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ ఉడమలపాడు గ్రామంలో ఉన్న మహిళలకు ఉచ్చితంగా ట్రైలరింగ్ శిక్షణ ఇచ్చి మరియు సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నామని తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ప్రదీప్ కుమార్ గారికి యువనేస్తం అసోసియేషన్ మరియు మహిళలు తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీచర్ సునీత మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.










Comments