top of page

అవయవదానం మహాదానం - కొవ్వూరు రమేష్ రెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 6, 2023
  • 1 min read

అవయవదానం మహాదానం - కొవ్వూరు రమేష్ రెడ్డి

ree

లివర్ అండ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా తాను పునర్జన్మ పొంది నేటికి 21 సంవత్సరం పూర్తి అవుతోందని, అవయవ దానాలపై పూర్తిగా అవగాహన లేని నాడే తనకు స్వప్న అనే అమ్మాయి ద్వారా లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా డాక్టర్లు నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారని, కావున అవయవదాత స్వప్న జ్ఞాపకార్థం ఆమెకు కృతజ్ఞతగా కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మార్చి 11వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకు ప్రొద్దుటూరులోని ఐఎంఏ హాలు నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కొవ్వూరు రమేష్ రెడ్డి తెలిపారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నందు కాలేయము, జనరల్ బాడీ చెకప్, డాక్టర్ల సలహా మేరకు ఉచిత పరీక్షలు చేసి మందులు ఇవ్వబడునని, కార్యక్రమంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్,  ప్రొద్దుటూరు లోని ప్రియ భావన హాస్పిటల్ డాక్టర్లు పాల్గొనేదరని,  కావున ప్రజలు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన కోరారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page