రాజుకుంట లో ఉచిత వైద్య శిబిరం
- DORA SWAMY

- Mar 6, 2022
- 1 min read

రేపు అనగా సోమవారం ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాదినేని రవి కుమార్ జ్ఞాపకార్థం.. నెల్లూరు జిల్లా నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నారాయణ ఆరోగ్యమస్తు పథకం ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రాజుకుంట గ్రామస్తులు తెలిపారు. ఇందులో కీళ్ల వైద్యులు, చక్కెర వ్యాధి నిపుణులు,కంటి వైద్యులు తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించి; శస్త్రచికిత్సలు అవసరమైతే వారిని నెల్లూరు నారాయణ ఆసుపత్రి తీసుకెళ్లి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు మరియు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. చిట్వేలి మండల పరిధిలోని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు అన్నారు.








Comments