మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
- EDITOR

- 7 days ago
- 1 min read
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల పది మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం లో పాఠశాలలో తయారు చేసిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించారు. అయితే కొద్దిసేపటికి పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పు ను వడ్డించకుండా పక్కన పెట్టేసి బయట నుంచి పప్పు తీసుకుని వచ్చి విద్యార్థులకు వడ్డించారు. మొదట పాఠశాలలో తయారు చేసిన పప్పును తిన్న పది మంది ఆరవ తరగతి విద్యార్థులకు కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం బయటికి పోక్కకుండా ఉండేందుకు హెడ్మాస్టర్ గుర్రప్ప వారిని తన గదిలో కూర్చోబెట్టుకున్నాడు. మీడియాకు సమాచారం తెలియడంతో స్కూల్ వద్దకు వెళ్లగా అప్పటికప్పుడు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.








Comments