అనాధలకు అన్నదానం
- DORA SWAMY

- Apr 20, 2023
- 1 min read
అనాధలకు అన్నదానం

చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన యన్నారు పరదేశయ్య, ధర్మపత్ని కృష్ణవేణి లు గురువారం రాజంపేట పాత బస్టాండ్ సమీపంలోని "నిరాశ్రయుల అనాధ ఆశ్రమంలో" అనాధలకు అన్నదానం నిర్వహించారు.

రాజుగుంట గ్రామానికి చెందిన మా తల్లి మాదినేని వెంకటసుబ్బమ్మ పెద్దకర్మను పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం ఈ రోజున పలువురు పేదలకు మా కుమారుడు దిలీప్ కుమార్ చొరవతో అన్నదానం నిర్వహించామని దాతలు అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు, అనాధలు సంతృప్తిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు యన్నారు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.









Comments