మానవతా ఆధ్వర్యంలో సుదీర్ పుట్టినరోజున పేదలకు అన్నదానం.
- DORA SWAMY

- Jul 2, 2022
- 1 min read
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో..
సుధీర్ పుట్టినరోజున పేదలకు అన్నదానం.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలు మండలం శింగనమల వీధికి చెందిన కంచెర్ల సుధీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిట్వేలు లోని నిరుపేదలు, యాచకులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదల మధ్య జన్మదినం కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు ముని రావు, చౌడవరం మురళి, కొనిసెట్టీ సుబ్బారాయుడు, మదాసు నరసింహ, పగడాల గణేష్ కుమార్, పసల శివ,పిక్కిలి బాబు,పగడాల శివ, సుబ్రమణ్యం, శింగనమల యూత్ , మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..








Comments