top of page

మంగంపేట వద్ద ఆటోను ఢీకొన్న లారీ. 5 మంది మృతి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 23, 2022
  • 1 min read

రక్తమయమవుతున్న... కడప చెన్నై రహదారి.


--కమ్మపల్లి క్రాస్ వద్ద..ఆటోను ఢీకొన్న లారీ

ఐదు మంది అక్కడకక్కడే మృతి.


ree

ఆ రహదారి ప్రయాణం అంటేనే హడల్.. నిత్యం భారీ వాహనాలతో భయభ్రాంతులవుతున్న ద్వి మరియు త్రిచక్ర వాహనదారులు. అనేక ప్రాణాలు గాలిలో కలుస్తున్న వైనం అయినను నాయకులు, అధికారుల్లో రాని చలనం. ఇంతటి తంతు జరుగుతున్న ఆ రహదారి పట్ల శ్రద్ధ లేకపోవడం అనగా విస్తరించలేకపోవడం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని పలువురు వాపోతున్నారు.


అది ఎక్కడ అంటారా కడప చెన్నై రహదారిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట దగ్గర నుంచి ప్రపంచ పటంలో ముగ్గురాయి నందు పేరుగాంచిన మంగంపేట వరకు ప్రతినిత్యం బారి వాహనాలతో రద్దీగా ఉన్న ఈ రహదారి జాతీయ రహదారి అయినప్పటికీ అన్నియు ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం చోచనీయం.


కాగా ఈ రోజున మంగంపేట క్రాస్ నందు కమ్మపల్లి వద్ద రాజంపేట నుంచి కోడూరు వైపుగా వెళ్తున్న ఆటోను చెన్నై నుంచి కడప వెళుతున్నటువంటి లారీ ఢీకొనడంతో చిన్న బాలిక,ఆటో డ్రైవర్ తో కలిపి మరో ముగ్గురు మొత్తం 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నందున నియోజకవర్గ ప్రతినిధులు, నాయకులు, అధికారులు దృష్టి సారించి మొదటగా రోడ్డును విస్తరించి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటే తప్ప చిన్న వాహనదారులకు ప్రమాదం తప్పదని పలువురు పేర్కొంటున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page