top of page

ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు

  • Writer: EDITOR
    EDITOR
  • May 24, 2023
  • 1 min read

ఒకే కాన్పులో ఐదుగురు

అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!

ఒకే కాన్పులో జన్మించిన ఐదుగురు ఆడపిల్లలు
ree

ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఆమెకు సాధారణ ప్రసవం జరగడం మరో విశేషం. అరుదైన ఈ సంఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్‌) ఆస్పత్రిలో సోమవారం ఓ మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చిందని, వారంతా బాలికలేనని వైద్యులు ట్విట్టర్‌లో తెలిపారు. సాధారణం కంటే తక్కువ బరువుతో పుట్టినందున నియోనాటల్‌ ఐసీయూలో వారిని సంరక్షించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page