భారీ అగ్నిప్రమాదం, ఇద్దరు సజీవ దహనం
- PRASANNA ANDHRA

- Oct 23, 2022
- 1 min read
భారీ అగ్నిప్రమాదం, ఇద్దరు సజీవ దహనం
విజయవాడ జింఖానా మైదానంలోని బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా బాణసంచా పేలింది. మంటల్లో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. 3 బాణసంచా స్టాల్స్ పూర్తిగా కాలిపోయాయి. భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నాలుగు ఫైరింజన్లలతో మంటలు ఆర్పుతున్నారు. మరోవైపు నిన్న రాత్రి తిరుపతిలోని వడమాలపేట బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విజయనగరం లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది.










Comments