top of page

హరిజనవాడలో అగ్ని ప్రమాదం లక్షా యాభై వేల రూపాయల ఆస్తి నష్టం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 8, 2022
  • 1 min read

హరిజనవాడలో అగ్ని ప్రమాదం లక్షా యాభై వేల రూపాయల ఆస్తి నష్టం - సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.


రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల పరిధిలోని నాగవరం ఎత్తు హరిజనవాడలో ఈరోజు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన రైల్వే కోడూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పి వేయడంతో చుట్టుపక్కల భారీ నష్టం కలగకుండా నివారించారు.

అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం సదరు గ్రామంలోని ఎన్ శివ కుమార్ తండ్రి చంద్రశేఖర్ ల భోధ తో కప్పబడిన ఇంటి నందు ఈ ప్రమాదం చోటు చేసుకుందని. పూర్తిస్థాయిలో ఇల్లు, ఇంటిలోని వస్తువులు ప్రమాదానికి గురయ్యాయని, కుటుంబ సభ్యుల అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారని,సుమారు 150000 రూపాయలు ఆస్తి నష్టం అయ్యి ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page