ఆకృతిలో అగ్నిప్రమాదం భారీగా ఆస్తి నష్టం
- PRASANNA ANDHRA

- Jan 29, 2024
- 1 min read
ఆకృతిలో అగ్నిప్రమాదం భారీగా ఆస్తి నష్టం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కొర్రపాడు రోడ్డులోని ఆకృతి రెడీమేడ్ షో రూమ్ నందు అగ్నిప్రమాదం, భారీగా ఎగసిపడుతున్న మంటలు. గడచిన నాలుగైదు రోజుల నుండి రానున్న వేసవికాలం నేపథ్యంలో ఏసీలు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉన్న యాజమాన్యం. మంటలు ఆర్పటానికి శతవిధాల ప్రయత్నిస్తున్న అగ్నిమాపక శాఖ. ఒకటవ అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం దట్టంగా వ్యాపించిన పొగలు. అదుపులోకి రాక ఎగసిపడిన మంటలు, మేఘాలను తలపించేలా నల్లటి పొగ వ్యాపించటంతో అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేసిన అగ్నిమాపక శాఖ. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియ రావలసి ఉంది. దట్టమైన పొగ కారణంగా సొమ్మసిల్లి స్పృహ కోల్పోయిన ఫైర్ మెన్.









Comments