top of page

చంద్రబాబు సహా 20 మందిపై హత్యాయత్నం కేసు

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 9, 2023
  • 1 min read

అంగళ్లు ఘటన... చంద్రబాబు సహా... 20 మందిపై హత్యాయత్నం కేసు...

ree

కురబలకోట, తెదేపా అధినేత చంద్రబాబు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘటనల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది..

ree

ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇతరులంటూ మరికొందరు తెదేపా నేతలపైనా కేసు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page