top of page

క్యాన్సర్ బాధితునికి ముక్కా ఫౌండేషన్ 50వేలు వితరణ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Dec 31, 2023
  • 1 min read

---చెక్కు అందించిన సాయి వికాస్ రెడ్డి.

--- ఆపదలో ఆదుకునే గుణం ముక్కా కుటుంబానికి సొంతం అంటూ గ్రామస్తులు కితాబు.


ree

చిట్వేలి మండల పరిధిలోని రాజకుంట పంచాయతీ అనుంపల్లి గ్రామానికి చెందిన మాదినేని చంద్రశేఖర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆదివారం ముక్కా ఫౌండేషన్ అధినేత రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి 50 వేల నగదును చెక్కు రూపంలో బాధితుని కుటుంబ సభ్యులకు అందించారు.కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఆపదలో ఉన్న అభాగ్యులను గుర్తించి ఆపన్న హస్తం అందిస్తున్న ముక్కా ఫౌండేషన్ సేవలు ఎనలేనివని స్థానిక గ్రామ ప్రజలు కొనియాడారు. స్థానిక రిపోర్టర్ మాదినేని.నాగరాజా బాధితుని ఇబ్బందిని ముక్కా వారికి తెలియపరిచి సహాయం అందించడంలో తోడ్పడ్డారు.


ree

ఈ కార్యక్రమంలో రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ, ఎం.నరసయ్య, ఎం. బాబు, నాగేశ్వర, సుధాకర్, బి సుబ్బరాయుడు,ఈశ్వరయ్య, ఎన్.రమేష్, వేణుగోపాల్, వెంకటరమణ, కుమార్, శివయ్య, అనుంపల్లి గ్రామ ప్రజలు, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, ముక్కా వారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్, సాలవ రమణ రాజు, గెద్ద పెంచలయ్య,పొలసాని కిరణ్, పొలసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page