ఫిబ్రవరి 14న బ్లాక్ డే గా ప్రకటించాలి - జనసేన
- PRASANNA ANDHRA

- Feb 14, 2022
- 1 min read

కడప జిల్లా, వీర జవాన్లకు జమ్మలమడుగు జనసేన పార్టీ ఘన నివాళి అర్పించారు. ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జనసేన నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ లు వీర జవాన్ల పుల్వామా ఉగ్రదాడి దాడిలో వీర మరణం పొందినటువంటి మన జవాన్లు ఆత్మశాంతి కోసం ఫిబ్రవరి 14న బ్లాక్ డే గా ప్రకటించాలని దేశం మొత్తం ముక్తకంఠంతో కోరుతోందని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా మన జవాన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎండనక వాననక చలికి తట్టుకొని దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసి కన్నతల్లిని కట్టుకున్న భార్య ని కన్న బిడ్డల్ని వదిలి మనకోసం రక్షణగా ఉన్న వీర జవాన్లకు జోహార్లు తెలియజేసుకుంటూ వీర మరణం పొందినటువంటి జవాన్లకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అశోక్, రవి, శేఖర్, సురేంద్ర, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు శివరాం మాదిగ తదితరులు పాల్గొన్నారు.








Comments