top of page

ఫిబ్రవరి 13 జైల్ భరో - విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 31, 2022
  • 1 min read

స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తారీకు జైల్ భరో కార్యక్రమానికి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈరోజు ప్లాంట్ లో జరిగిన పోరాట కమిటీ సమావేశానికి గణపతి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫిబ్రవరి 13వ తారీఖున జైల్ భరో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

ree

ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ఏడో తారీఖు వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రతి నిర్వాసిత కాలనీ లోనూ ప్లాంట్ లో ప్రతి విభాగంలోనూ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12వ తారీకు 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 365 మంది కార్యకర్తలతో 365 జెండాలతో రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద దీక్ష చేపట్టలనే నిర్ణయాన్ని వారు బలపరిచారు. ఫిబ్రవరి 13వ తారీఖున జైల్ భరో కార్యక్రమం చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.


ఈ సమావేశంలో పోరాట కమిటీ ప్రతినిధులు జె అయోధ్య రామ్, వైటి దాస్, యు రామస్వామి, గంధం వెంకట్రావు, డి వి రమణ , మురళి రాజు, సంపూర్ణ, కె. సత్యనారాయణ రావు, జె. రామకృష్ణ, దాలి నాయుడు, బొడ్డు పైడిరాజు, వి. రామ్ మోహన్ కుమార్, డి.సురేష్ బాబు, వరసాల శ్రీనివాస్, జి ఆర్ కె నాయుడు, త్రినాద్ రెడ్డి, బి కామేష్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్, నూకరాజు ఒప్పంద కార్మిక సంఘాల ప్రతినిధులు పి. శ్రీనివాసరాజు, నమ్మి రవణ, పిట్ట రెడ్డి, కనక రెడ్డి

వి ప్రసాద్

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page