top of page

కన్న కూతురిని అతి కిరాతకంగా హత్య చేసిన తండ్రి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 26, 2022
  • 1 min read

కన్న కూతురిని అతి కిరాతకంగా హత్య చేసిన తండ్రి

ree

కొద్ది రోజులుగా పాతపల్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. గ్రామమంతా పాకి కొందరు ఆమె తండ్రి తో చెప్పగా అవమానం గా బాధపడ్డాడు. 3, 4 సార్లు అమ్మాయిని మందలించాడు. అయినా వినలేదు. దీపావళి కావడంతో కుటుంబ సభ్యులందరూ ఆదివారం పండగకు వనపర్తి మండలం చందాపూర్ కు వెళ్లారు. సోమవారం సాయంత్రం తండ్రి రాజశేఖర్, గీత ఇద్దరు కలిసి పాతపల్లికి వచ్చేశారు. రాత్రి సమయంలో కూతురు బయటికి వెళ్లి ఇంటికి త్వరగా రాకపోవడంతో అనుమానం వచ్చి కొంతసేపు వెతికిన తరవాత కనిపించడంతో తండ్రి ఇంటికి తీసుకెళ్లి కొట్టాడు. మంగళవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఊర్లో గ్రామస్తులు పలు రకాలుగా అనుకుంటున్నారని, కుటుంబ పరువు తీస్తోందని ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్షణికావేశంలో తండ్రి రాజశేఖర్ చేతికి దొరికిన పదునైన ఆయుధం తో గొంతు, చెవి, మెడ కింది భాగంలో పొడిచి పొడిచి చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా పొలానికి వెళ్లిపోయాడు. గ్యాస్ సిలిండర్ కోసమని బయటికి వెళ్లిన గీత నానామ్మ ఇల్లు తెరిచి చూడగా అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేసింది. దీంతో ఊరంతా ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా ఎస్సై రామస్వామి, కొత్తకోట ఇన్ఛార్జి సీఐ కే.ఎస్ రత్నం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. రాజశేఖర్ ను కూడా వెంటనే అదుపులోకి తీసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా వనపర్తి డీఎస్పీ ఆనందరెడ్డి అక్కడకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కన్నతండ్రే కూతురిని హత్య చేశాడని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం అమ్మాయి డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page