top of page

ఐదేళ్ల పసికందు పై తండ్రి అఘాయిత్యం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 25, 2022
  • 2 min read

ఐదేళ్ల పసికందు పై తండ్రి అఘాయిత్యం....

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య....


అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారి బాలిక పై కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి అఘాయిత్యనికి పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చిన్నారి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకు 2016 సంవత్సరంలో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం కి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. పాప, బాబు. పాపకు ఐదు సంవత్సరాలు. ఆదం షఫీ బొప్పూడి లో ఉంటూ చిలకలూరిపేట పట్టణం కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న చిన్న పిల్లలు తినే వస్తువుల దుకాణం లో పనిచేస్తున్నాడు.ఐదు సంవత్సరాల కుమార్తె చిలకలూరిపేట లోని ఓ స్కూల్లో చదువుకుంటుంది. స్కూల్ కు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేసేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న పక్కన పడుకో పెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. సరెనంటూ తల్లి ఓదార్చింది.

ree

ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన పడుకుంటారు. చిన్నారి చెప్పి న విషయంతో తల్లి హుస్సేన్ భీ ఆలోచనలో పడింది. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం కూడా ఆమెకు వచ్చింది. గత వారం రోజులుగా పలుమార్లు కూతురు చెప్పిన విషయాన్ని చెప్పడంతో భర్తను అనుమానించింది. ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బి నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్త చేసే పనులు గమనించింది. తాను నిద్ర పోతున్నానా..? లేదా..? అని సెల్ ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్ర పోతున్నానని గుర్తించి వెంటనే రంగంలోకి దిగాడు. ఐదు సంవత్సరాల కుమార్తె పక్కన పడుకుని సెల్ ఫోన్ ఆన్ చేశాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ తన ఫాంట్ కిందకు అనుకొని నిద్రపోతున్న కన్న కూతురిపై అఘాయిత్యనికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బి వెంటనే భర్త ని పట్టుకుంది.


ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్త లాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని వాపోయింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణ సంఘటనలు మరొకరికి జరగకుండా తన భర్త లాంటి కసాయి వ్యక్తులు భూమి మీద ఉండకూడదని పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page