అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కొరముట్ల
- DORA SWAMY

- May 4, 2022
- 1 min read
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కొరముట్ల - నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని అధికారులకు సూచన - ఆదుకుంటామని రైతులకు భరోసా.

ఈరోజు మధ్యాహ్నం పుల్లంపేట మండలం దళవాయిపల్లి, కేత రాజు పల్లి గ్రామాల నందు మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి దెబ్బతిన్న అరటి చెట్లను అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. నష్టపరిహారాన్ని అంచనా వేసి నివేదికలు పంపాలని సదరు అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రైతులకు తగు న్యాయం చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుదర్శన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.








Comments