ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము ఉచితం
- PRASANNA ANDHRA

- Oct 15, 2023
- 1 min read
ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము ఉచితం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నందు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చొరవతో ప్రవేశ రుసుము ఉచితమని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందిస్తూ జెయింట్ వీల్, డిస్కో డాన్స్, డ్రాగన్ వీల్, ట్రైన్, మాయాజాలం లాంటి పలు రకాల వినోదాన్ని అందించే ఆహ్లాదకరమైన వాతావరణంలో పొందుపరిచామని సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.









Comments