ఎగ్జిబిషన్ వేలంపాట వాయిదా...
- PRASANNA ANDHRA

- Sep 10, 2024
- 1 min read
ఎగ్జిబిషన్ వేలంపాట వాయిదా...

ప్రొద్దుటూరు పురపాలక సంఘమునకు చెందిన అనిబిసెంట్ మునిసిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు 2024 సంవత్సరము అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో దసరా నవరాత్రులు ప్రారంబించిన తేది నుండి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించుటకు గాను గుత్త హక్కుకై తేది 10.09.2024 మంగళవారం ఉదయం 11.00 గంటల నుండి మునిసిపల్ ఆఫీసు నందు జరుపుటకు నిర్ణయించిన టెండర్ - కం - బహిరంగ వేలము అనివార్య కారణములు వలన వాయిదా వేయడమైనది. తదుపరి తేది 12.09.2024 గురువారము ఉదయం 11.00 గంటల నుండి మునిసిపల్ ఆఫీసు నందు జరుపబడును అని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.









Comments