మునిసిపల్ గ్రౌండ్స్ నందు ఎక్సిబిషన్ ప్రారంభం
- PRASANNA ANDHRA

- Sep 26, 2022
- 1 min read
మునిసిపల్ గ్రౌండ్స్ నందు ఎక్సిబిషన్ ప్రారంభం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

సోమవారం సాయంత్రం స్థానిక అనిబిసెంట్ మునిసిపల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎక్సిబిషన్ ను నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పిల్లలకు పెద్దలకు వినోదాన్ని ఆనందాన్ని అందించే కొలంబస్, బ్రేక్ డాన్స్, జయింట్ వీల్, ట్రైన్, ఉయ్యాల, ఆట బొమ్మలు, వివిధ రకాల తిను బండారాలు, ఐస్ క్రీం లాంటి అన్ని దుకాణాలను ఎక్సిబిషన్ నిర్వాహకులు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే రాచమల్లు వాటిని సందర్శించారు. ఉచిత ప్రవేశం కావటం చేత మొదటి రోజే పిల్లలు పెద్దలు పెద్దఎత్తున ఎక్సహిబిటన్ తిలకించెందుకు మునిసిపల్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు.








Comments