ఎన్విఆర్ఆర్ అంటే నిమ్మకాయల వెంకట రమణారెడ్డి - మాజీ సర్పంచ్ శివనాగిరెడ్డి
- PRASANNA ANDHRA

- Aug 26, 2024
- 1 min read
ఎన్విఆర్ఆర్ అంటే నిమ్మకాయల వెంకట రమణారెడ్డి - మాజీ సర్పంచ్ శివనాగిరెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
టిడిపి నాయకులు టిప్పర్లతో ఇసుక, మట్టిని తరలిస్తున్నారని ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి పై బురద చల్లడం మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డికి తగదని మాజీ సర్పంచ్ నంద్యాల శివనాగిరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ కమిటీలకు సంబంధించి గ్రామం తరపున తాము మట్టిని తోలుకుంటున్నట్లు, ఈ మట్టి ద్వారా గ్రామంలోని పార్క్ అలాగే రోడ్లలోని గుంతలు పూడ్చటానికి ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామ కమిటీ నిర్ణయం మేరకే తాము మట్టిని ఉపయోగించుకున్నట్లు, అయితే వైసిపి నాయకులు టిప్పర్లపై గల ఎన్విఆర్ఆర్ అనే పేరును వక్రీకరించి శాసనసభ్యులు వరద పై బురద చల్లే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్.వి.ఆర్.ఆర్ అనగా నిమ్మకాయల వెంకట రమణారెడ్డి అని, అతని పేరు మీదనే టిప్పర్లు ఉన్నట్లు స్పష్టం చేస్తూ, వైసిపి హయాంలో ఇష్టా రాజ్యంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏనాడు ఎమ్మెల్యే వరద ఆయన కుటుంబ సభ్యులు అవినీతిని ప్రోత్సహించలేదని, ఇకనైనా వైసీపీ నాయకులు నిజా నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని హితువు పలికారు.











Comments